మహభారత కాలం నాటి కోట

కాంగ్రా కో



             మన దేశంలోని పురాతనమైన కొటల్లో ఒకటి కాంగ్రా.హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ మంచు పర్వతం దిగువ ప్రాంతంలో ఉండే ఈ కోట చరిత్ర మహాభారత కాలం నుండి మొదలవుతుంది.అప్పటి త్రిగర్త రాజ్య పాలకుడు సుశర్మ దీనిని నిర్మిం చాడంటారు.ఈతడు దుర్యోధనుడి భార్య భానుమతికి తమ్ముడి వరుస అంటారు.సుమారు క్రీ.శ. ఏడో శతాబ్దం వరకు ఈ కోట అతడి వారసులయిన కటొచ్  రాజవంశీయుల ఏలుబడిలో ఉంది.


కాంగ్రా లోయా...  

              ఈ పేరు వెనక పెద్ద కథే ఉందట . ప్రాచీన కాలంలో ఇక్కడ క్షుతగాత్రులకు చేవి ముక్కుకి సంబంధించి శస్త్రచికిత్సలు చేసే నిపుణులు ఉండేవారట. అందుకనే కాంగ్రా పేరొచ్చిందని చక్ర సంహిత, సుశృత సంహిత వంటి వైద్య గ్రంథాల్లో రాశారు.




అందమైన కోట...

               కాంగ్రా కోటను ఎడు దర్వజలతో నిర్మించారు.కోటకు నలువైపులా పచ్చదనం, ఎత్తైన పర్వతాలు, కాంగ్రా లోయ,లోయలో ప్రవహించే, మాంజి, బాన్, గంగా నదుల సంగమ సోయగాలు అన్ని పర్యాటకులని అలరిస్తాయి.కోట చుట్టూ ఉన్న రతి గోడ సుమారు 30 కి.మి. మేర ఉంటుంది.లోపల విశాలమైన ప్రదేశం, అందమైన నిర్మాణాలు కనిపిస్తాయి.కోటలో ఒక చోట సింహం విగ్రహం ఉంటుంది. దాని నోటి నుండి ఏడాది పొడుగునా నీరు వస్తుంటుంది.


గజనీ దండెత్తాడు...

              చంద్రవంశపు కటోచ్ రాజైన భూమా చంద్ ఈ కోటను విస్తరింపచేసి నగర కోట అని పేరు పెట్టాడట. కటొచ్ రాజులు ఈ కోటలో చాలా మందిరాలు నిర్మించారు. ఈ కోటను అక్రమించడానికి ఎందరో ప్రయత్నించారు. మహమ్మద్ గజనీ ఈ రాజ్యం మీద ఎన్నో సార్లు దాడి జరిపి సంపద కొల్లగొట్టారు. మొఘలుల కాలంలో జహంగీర్ ఈ కోటను వశపరుచుకున్నడు .1786 లో తిరిగి ఈ కోటను కటోచ్ వంశీకులు కు ఈ కోట చేజిక్కింది.1801 లో మహారాజ సింగ్ వశమైంది.ప్రస్తుతం పురాతత్వ శాఖ ఆధీనంలో ఉంది.



ఆలయాలు....శిలపకలా...

                     ఈ కోట ముకాద్వరాని రంజిత్ సింగ్  గేటు అని పిలుస్తారు.ముందుకి వెళ్తే జహంగీర్ ద్వారం వస్తుంది.తర్వాత వచ్చే అందేరి దర్వాజ నుండి రెండు మార్గాలు కనబడతాయి. కాంగ్రా కోటలో లక్ష్మీ నారాయణ, శీతల మాత, అంబికా దేవి ఆలయాలు ముఖ్యమైనవి. అంబికాదేవి ఆలయంలో ఇప్పటికి పూజలు జరుగుతున్నాయి. లక్ష్మీ నారాయణ మందిరం పైకప్పు అందమైన శిల్పాలతో బాగుంటుంది.

              ఇవే కాదు అంబికాదేవి ఆలయానికి దక్షిణంగా రెండు చిన్న జైన మందిరాలు ఉన్నాయి. కోటలో మొగల్ కాలం నాటి మసీదును కూడా చూడొచ్చు. కోటకు ఉత్తరాన ఉండే ప్యాలెస్ వరకు మెట్ల దారి ఉంది. కోటకు నైరుతిలో ఉండే బహుభుజి వాచ్ టవర్ నుంచి మొత్తం కాంగ్రా లోయ అందాలను చూడొచ్చు. అయితే అందమైన ఈ కాంగ్రా కోటకు 1905లో ఒక ప్రమాదం ఎదురైంది. అప్పటి భూకంపం కారణంగా ఈ కోట పూర్తిగా పాడుబడి పోయింది. తర్వాత ఈ కోటలోని శిల్పాలు, కళారూపాలు, కాంగ్రా చరిత్రకు సంబంధించిన శాసనాలను భద్రపరిచారు. వాటితో కాంగ్రా పట్టణంలో ప్రదర్శనశాల నిర్వహిస్తున్నారు.




గుప్తనిధులున్నాయా..? 

                  కాంగ్రా కోట సొరంగాలలో అంతులేని సంపద నిక్షిప్తమై ఉందని ప్రజలు నమ్ముతారు. ప్రాచీన కాలం నుంచి సిరిసంపదలతో తలతూగిన ఈ కోటను దోచుకోవడం కోసమే ఎన్నెన్నో దాడులు జరిగాయి. అందువల్లే నాటి రాజులు తెలివిగా వజ్రవైడ్యురాలు, బంగారం మొదలైన వాటికి కోట లోపల రహస్య సొరంగాలలో దాచిపెట్టారట. ఆ గుప్తనిధులకు నాగసర్పాలు కాపలా కాస్తుంటాయని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఇవన్నీ ఊహాగానాలేనని పురాతత్వశాఖ చెబుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది