శీర్షిక లేదు

*సాగరకన్యలు ఉన్నారా?

చిన్నప్పుడు మనం చందమామ కధలలో సాగరకన్యల గురించి చదువుకున్నాం. కానీ అవి కధల వరకేనా లేక నిజంగా అవి ఉన్నాయా అనేదే ఇపుడు ప్రశ్న. తల నుండి నడుము వరకు మనిషి లా ఉండి, నడుము క్రింది భాగం అంతా చేప లా ఉండే ఈ సాగరకన్య లు సముద్రం లోని ఏ ప్రాణీ వెళ్లలేనంత లోతుకు వెల్లగలవని, వాటికి సముద్రం లోని అపారమైన ఖనిజ సంపదను గుర్తించే శక్తి ఉందని అంటుంటారు.
కొన్నేళ్ళ క్రితం ఫిజీ సముద్ర తీరం లో చేపలు పట్టేవాళ్ళకు ఒక మరణించిన మత్స్యం లభించింది. అది నడుము వరకు మనిషి లా, నడుము కింద చేపలా ఉండటం తో దాన్ని సాగరకన్య గా గుర్తించారు. దాంతో ఎన్నో ఏళ్లుగా సాగరకన్య ల మీద పరిశోధనలు చేస్తున్న డాక్టర్ గ్రిఫిన్ అక్కడకు వచ్చి దానిని తన ప్రయోగశాలకు తీసుకువెళ్ళి పరిశోధన చేసి దానిని సాగరకన్య గా నిర్ధారించాడు.
మన దేశం లో కూడా సాగరకన్య లభించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. డిసెంబరు 2004 లో సునామీ వచ్చినపుడు చెన్నై మెరీనా బీచ్ కు ఒక సాగరకన్య కొట్టుకువచ్చినట్లుగా అప్పట్లో కొంతమంది పేర్కొన్నారు. ఏది ఏమైనను భగవంతుని అపూర్వ సృష్టి లో సాగరకన్య ఒక అద్భుతం, విశేషం అది ఉన్నా లేకపోయినా. . .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది